రేవంత్ రెడ్డి ఇంకా పాత కేరక్టర్ లో నుంచి బయటకు రావడం లేదు. ముఖ్యమంత్రిలా కాకుండా.. ఓ పార్టీ నాయకుడిలాగానే మాట్లాడుతున్నారు. జనం సొమ్ముతో దావోస్ వెళ్లిన ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీకి పబ్లిసిటీ చేసుకోవడమే దీనికి నిదర్శనం అన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి. దేశంలోనే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలనే ఆలోచన చేసింది, ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి రైతు భరోసా పేరుతో రైతులకు కాంగ్రెస్ పార్టీ పెట్టుబడి సాయం చేస్తోందని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎన్నికల్లో గెలవగానే రైతుభరో ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.
ఇప్పటి వరకు రైతుభరోసా పథకాన్ని ప్రారంభించలేదు. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు పథకాన్ని కూడా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. పంటల సాగు సమయం ముగిసిపోయినా ఇప్పటికీ రైతుబంధు రాలేదు. ఇయ్యాల్సింది ఇవ్వలేదు. ఇస్తామని చెప్పింది ఇవ్వలేదు. పైగా కేసీఆర్ గారు ఆరేళ్ల క్రితం ప్రారంభించి అప్రతిహతంగా 11 సార్లు రైతులకు రైతుబంధు ఇచ్చారు. కానీ ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది అని చెప్పుకోవడం సిగ్గుచేటు. మంచి చేసిన బీఆర్ఎస్ పేరు పలికే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోతే తెలంగాణ ప్రభుత్వం అని చెప్పాలి. కానీ దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించి రైతుల ఉసురుపోసుకున్న కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పడం కంటే సిగ్గుమాలిన పని మరొకటి లేదు.
జనం సొమ్ముతో దావోస్ వెళ్లింది కాంగ్రెస్ పార్టీకి ప్రమోషన్ చేసుకోవడానికి కాదని రేవంత్ రెడ్డి గ్రహించాలి. తాను కాంగ్రెస్ పార్టీ నాయకుడే అయినా.. దానికన్నా ముందు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తెరిగి మాట్లాడాలి. మరోవైపు.. దావోస్ లో అదానీని కలవడంపైనా సొంత పార్టీలోనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దాన్నుంచి బయటపడేందుకు, తాను కాంగ్రెస్ వాడినేనని చెప్పుకునేందుకే దావోస్ లో పదే పదే కాంగ్రెస్ పార్టీ పేరు ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ మీద మీ పార్టీకి నమ్మకం కలగాలంటే వాళ్ల దగ్గరికి వెళ్లి చెప్పుకోండి. కానీ ఇలా మీ అవసరాల కోసం, పార్టీ కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకండి…రాష్ట్రం పరువు తీయకండన్నారు.
Also Read:నేరేడు పండు తింటే ప్రమాదమా?