తెలుగు భాషను చంపేస్తున్న రేవంత్?:రాకేష్ రెడ్డి

9
- Advertisement -

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టాత్మక సంస్థ ,రాజ్యాంగ సంస్ధ అన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి.తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రాకేష్‌ రెడ్డి.. రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంలో 2 లక్షల ఉద్యోగాలు టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు ..రెండు లక్షల ఉద్యోగాల భర్తీ మాట దేవుడెరుగు ..గ్రూప్ వన్ కు సంబంధించి 20 వేల పేపర్లు కూడా సరిగా దిద్దలేక పోయారు ..రెండు నిమిషాల్లోనే పేపర్లు కొట్టేసినట్టు అనిపిస్తోంది అన్నారు.

563 గ్రూప్ వన్ పోస్టులకు ఫలితాలు ప్రకటిస్తే 500 ర్యాంకుల లోపు ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్ధి కూడా లేరు …కృష్ణ దేవరాయలు దేశభాష లందు తెలుగు లెస్స అంటే రేవంత్ రెడ్డి తెలుగు లెస్ అంటున్నారు ..40 శాతం మంది తెలుగు మీడియం అభ్యర్థులు గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తే అందులో పది శాతం కూడా పోస్టులు సాధించలేరా ?…రేవంత్ రెడ్డి తెలుగు భాషను చంపేస్తున్నారు …తెలంగాణ తల్లిని మార్చింది ఇందుకేనా ? అన్నారు.

ఇదే రేవంత్ రెడ్డి వేలాది ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్లను మూసివేశారు …విద్యాశాఖ మంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డి కి మాతృ భాష పై శ్రద్ధ లేదు ..టీజీపీఎస్సి పరీక్షలకు తెలుగు అకాడెమీ పుస్తకాలు ప్రామాణికం కావు అంటున్నారు ..రేపు తెలుగు భాషనే ప్రామాణికం కాదంటరేమో ..కేవలం రెండు పరీక్షా కేంద్రాల్లోనే 74 మంది గ్రూప్ వన్ టాపర్లు ఉన్నారు .కేవలం 15 సెంటర్లోనే మొత్తం ర్యాంకులు రావడం ఏమిటీ ?…అనేక సెంటర్లలో ఒక్కరికి కూడా రాంక్ రాలేదు …ఓకే మార్కులు వచ్చిన వారు ప్రత్యేకించి కొన్ని సెంటర్ల నుంచే ఉన్నారు …గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు …గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో ఒక హల్ టికెట్ నెంబర్ ,మెయిన్స్ లో ఇంకో హల్ టికెట్ నెంబర్ ఇచ్చారు .ఎక్కడా ఇలా జరగదు …గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ లో అనేక అవకతవకలు జరిగాయని మాకు అనుమానాలు ఉన్నాయి అన్నారు.

Also Read:రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏది?:ప్రవీణ్‌ కుమార్

ఈ పరీక్షల్లో థర్డ్ ఎవాల్యుయేషన్ జరగలేదు ,సెకండ్ ఎవాల్యుయేషన్ కూడా సరిగా జరగలేదు ..ప్రొఫెసర్ల తో పేపర్లు దిద్దించాల్సింది పోయి కొందరు కాంట్ట్రాక్టు ఉద్యోగులతో దిద్దించారు …ఆరు గ్యారంటీల తరహాలోనే గ్రూప్ వన్ పరీక్ష ను గోల్ మాల్ చేశారు …నా మీద కేసు పెట్టినా ఫర్వా లేదు .గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలి …ఫిబ్రవరి లో గ్రూప్ వన్ ఫలితాలు వస్తాయని నవంబర్ లోనే కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టు చేశారు ..టీజీపీఎస్సీ చెప్పాల్సిన సమాచారం కాంగ్రెస్ పార్టీ ఎలా చెబుతోంది ?…తొమ్మిది వేల మంది రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా మార్కులు పెరగలేదు …ముందే అనుకుని మ్యాచ్ ఫిక్సింగ్ తో మార్కులు వేశారు …టీ జీ పీ ఎస్ సి వాళ్ళు కాన్ఫిడెన్షియల్ డాటా ఇస్తున్నారా ..కాంగ్రెస్ డాటా ఇస్తున్నారా ?…గ్రూప్ వన్ పరీక్షల మీద 30 ,నలభై కేసులున్నాయి ..ఏ రాష్ట్రం లో ఇలా కేసులు లేవు ..కేసులన్నింటినీ తుంగలో తొక్కేసినా అని రేవంత్ రెడ్డి కోర్టులను ప్రశ్నించే విధంగా రవీంద్రభారతి లో మాట్లాడారు …అడిగిన వాటికి రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వడం లేదు ..ఉస్మానియా యూనివర్సిటీ లో ఆంక్షలు పెట్టేందుకు రేవంత్ రెడ్డి అయ్య జాగీరా ?…తెలంగాణ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి పడ్డ గడ్డ ఉస్మానియా …..కోర్టులు మొట్టి కాయలు వేస్తున్నా రేవంత్ బుద్ది మారడం లేదు ..హైడ్రా ,ఫ్యూచర్ సిటీ ఫిరాయింపులు ,హెచ్ సీ యూ కేసుల్లో రేవంత్ రెడ్డి కి కోర్టు చెంప పెట్టు లాంటి ఆదేశాలు ఇచ్చింది …గ్రూప్ వన్ పేపర్లు మొత్తం మళ్ళీ ఎవాల్యుయేషన్ చేయాలి …అశోక్ నగర్ లో ఆందోళనలు చేస్తున్న వారితో మాట్లాడాలి ..ఎవరు సీఎం ను గుర్తుపట్టకున్నా అశోక్ నగర్ లో ఆందోళన చేస్తున్న వారు మాత్రం గుర్తు పడతారు …విద్యా శాఖ మంత్రి మారతారు అనుకుంటే రేవంత్ తానే కొనసాగుతునని చెప్పి విద్యార్థుల గుండె మీద బండ వేశారు …ఇప్పటికైనా గ్రూప్ వన్ లో జరిగిన లోపాలు సరిదిద్ది అభ్యర్థులకు న్యాయం చేయాలి అన్నారు.

Also Read:రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏది?:ప్రవీణ్‌ కుమార్

- Advertisement -