ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సాధారణ స్థాయితో పోలిస్తే 3.3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ వేదిక వరంగల్ నుంచి మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కు మార్పు చేస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ రజితోత్సవ వేడుకల సందర్భంగా ఏప్రిల్ 27 వరంగల్‌లో భారీ బహిరంగసభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభకు భారీ జనసమీకరణకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్. ఇప్పటికే కేటీఆర్ జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు కేటీఆర్.
Also Read:కాంగ్రెస్ పాలనలో అధోగతి: కేటీఆర్