ఎల్ఆర్ఎస్‌పై బీఆర్‌ఎస్‌ ఆందోళన

24
- Advertisement -

కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానంపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. గతంలో కాంగ్రెస్ నేతలు ఉచితంగా ఎల్‌ఆర్ఎస్ తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు.

ప్రజల నుండి డబ్బులు దోచుకోవడానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్, సీతక్క చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేసే వరకు ప్రజల తరఫున పోరాడుతామని హెచ్చరించారు.

ALso Read:ఆ నటి పై కూడా లైంగిక వేధింపులు

- Advertisement -