తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇక ప్రధాన పార్టీలన్ని ప్రచారాన్ని ముమ్మరం చేయగా బీఆర్ఎస్ మాత్రం విస్తృతంగా దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇవాళ కేటీఆర్ 5 రోడ్‌ల్లో పాల్గొననుండగా హరీశ్ రావు సైతం 6 సభల్లో పాల్గొని ప్రచారం చేయనున్నారు.
మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విషయానికొస్తే..ఉదయం 11 గంటలకు బిక్‌నూర్ రోడ్ షోలో పాల్గొననున్నారు.తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు కామారెడ్డి పట్టణంలో, 3.30 గంటలకు నిజామాబాద్ టౌన్‌లో, రాత్రి 6.30 గంటలకు మలక్‌పేట్‌లో,7.30 గంటలకు గోషామహల్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగంచనున్నారు.
ఇక హరీశ్ రావు ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ని ఈ విధంగా సాగనుంది. ఉదయం 11 గంటలకు మహబూబాబాద్‌లో, మధ్నాహ్నం 1 గంటలకు నర్సంపేటలో, 2.30 గంటలకు పాలకుర్తిలో, సాయంత్రం 4 గంటలకు చేర్యాలలో, రాత్రి 6 గంటలకు ఆలేరులో, రాత్రి 8 గంటలకు భువనగిరి సభల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
Also Read:రైతుబంధుకు గ్రీన్ సిగ్నల్