మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగసభ..

45
- Advertisement -

ఇవాళ మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) భారీ బహిరంగసభ జరగనుంది. నాందేడ్ జిల్లా కేంద్రంలో నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే తెలంగాణ రాష్ట్రం బయట బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన తొలి సభ ఇదే.

సీఎం కేసీఆర్ టూర్ షెడ్యూల్ ఇదే..

()సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు నాందేడ్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

() అక్కడి నుంచి ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకొని నివాళులర్పిస్తారు. ఆ తరువాత చారిత్రక గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

(0 మధ్యాహ్నం 1.30 గంటలకు బహిరంగ సభాస్థలి వద్దకు చేరుకుంటారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు.

() నాదేండ్ జిల్లా కేంద్రంలో జరిగే సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.

()2.30 గంటలకు స్థానిక సిటీ ఫ్రైడ్ హోటల్ కు చేరుకుంటారు.

()4గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

ఈ బహిరంగసభకు భారీగా జనాన్ని తరలించేలా ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నాయకులు. నాందేడ్ జిల్లా తెలంగాణ సరిహద్దు జిల్లా కావటంతో తెలంగాణలో అమలవుతున్న పథకాలను వివరిస్తూ, బీఆర్ఎస్ కు మద్దతుగా నిలవాలని, సభను విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -