తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత జాతీయ స్థాయిలో మద్దతు భారీగా లభించింది. అన్నీ రాష్ట్రాల నుంచి కూడా కీలక నేతలు కేసిఆర్ ఎంట్రీని స్వాగతించారు. మోడీ నియంత పాలనకు చేరమగీతం పెట్టలంటే ధీటైన ప్రత్యర్థి కేసిఆర్ ఒక్కరే అనే భావనతో విపక్షాలన్నీ కూడా బిఆర్‌ఎస్ రాక ను స్వాగతించాయి. దాంతో పార్టీ బిఆర్‌ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఎంతో మంది కీలక నేతలు బిఆర్‌ఎస్ వైపు చూస్తూ కేసిఆర్ నాయకత్వంలో నడిచేందుకు మొగ్గు చూపుతున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుండడంతో కేసిఆర్ విజన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Also Read:Kerala:ప్రధాని మోదీకి బెదిరింపు కాల్..
ఇప్పటికే ఏపీ కర్నాటక వంటి రాష్ట్రాలలో ఇతర పార్టీల నుంచి బిఆర్‌ఎస్ లో చేరుతున్న వారి సంఖ్య రోజు పెరుగుతోంది. ఇక మహారాష్ట్రలో కూడా అక్కడి స్థానిక పార్టీలకు పోటీ నిచ్చేలా బిఆర్‌ఎస్ బలం పెంచుకోవడం, బీజేపీ., కాంగ్రెస్ వంటి పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. శివసేన, ఎన్సీపీ, బీజేపీ వంటి పార్టీలకు చెందిన కీలక నేతలు బిఆర్‌ఎస్ ను ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తుండడంతో ఇతర పార్టీల నుంచి బిఆర్‌ఎస్ లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఆ మద్య ఎన్సీపీ పార్టీ కి చెందిన నేత ప్రదీప్ సలుమ్కే, మాజీ ఎమ్మెల్యే సంగీత వి తొంబరే దంపతులు బిఆర్‌ఎస్ గూటికి చేరి ఇతర పార్టీలకు షాక్ ఇచ్చారు.
వీరితో పాటు ఇంక చాలమంది నేతలు శంకర్న ధొంగే ( మహారాష్ట్ర బిఆర్‌ఎస్ నాయకుడు ) సమక్షంలో బిఆర్‌ఎస్ గూటికి చేరారు. ఇదిలా ఉంచితే తాజాగా మహారాష్ట్రలోని ప్రాంతీయ పార్టీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ పార్టీ ఏకంగా బిఆర్‌ఎస్ లో విలీనం అవుతున్నట్లు ప్రకటించి అందరి దృష్టి బిఆర్‌ఎస్ పై పడేలా చేసింది. సర్ధార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ పార్టీ బిఆర్‌ఎస్ లో విలీనం కావడంతో అక్కడి నేతలు కేసిఆర్ విజన్ కు ఏ స్థాయిలో ఆకర్షితులౌతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే బిఆర్‌ఎస్ ఈ స్థాయిలో మద్దతు పెరగడానికి ప్రధాన కారణం తెలంగాణలో కేసిఆర్ చేసిన అభివృద్ది, అమలు చేస్తున్న సంక్షేమ పతకలే ప్రధాన కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ మోడల్ కు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్దతు లభిస్తుండడంతో రాబోయే కొద్ది రోజుల్లోనే మూడవ అతిపెద్ద జాతీయ పార్టీగా బిఆర్‌ఎస్ అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read:మృణాల్ ఠాకూర్ కి మరో క్రేజీ ఆఫర్ !