బీఏసీ సమావేశాన్ని బైకాట్ చేసిన బీఆర్ఎస్..

14
- Advertisement -

రాజ్యసభ బీఏసీ సమావేశాన్ని బైకాట్ చేశారు బీఆర్ఎస్ ఎంపీలు. పార్లమెంటు ఉభయ సభలకు నల్ల దుస్తులు ధరించి వెళ్లాలని నిర్ణయించారు. మణిపూర్ అంశంతో పాటు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఉభయసభల్లో నల్ల దుస్తులు ధరించి నిరసన తెలపనున్నారు బీఆర్ఎస్ ఎంపీలు.

ఇప్పటికే ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును వ్యతిరేకిస్తూ సభ్యులందరూ అందుబాటులో ఉండాలని రాజ్యసభలో బీఆర్ఎస్ విప్ సంతోష్ కుమార్, లోక్ సభలో బీఆర్ఎస్ విప్ బీబీ పాటిల్ విప్ జారీ చేశారు. ఇక ఇప్పటికే మోడీ సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా దానిని స్పీకర్ అమోదించిన సంగతి తెలిసిందే. త్వరలోనే అవిశ్వాస తీర్మాన తేదీని ప్రకటించనున్నారు స్పీకర్.

Also Read:ట్రెండింగ్‌లో ‘టిల్లు స్క్వేర్’ సాంగ్

- Advertisement -