- Advertisement -
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భించిన అనతి కాలంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించే విధంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రచించారు. ఈమేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ తోట చంద్రశేఖర్‌తో భేటీ ఆయ్యారు. ఈ కార్యక్రమంలో రావెల కిశోర్‌బాబు, పార్థసారథి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, ఇతర నాయకులు కలిశారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి…ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం పలు సమావేశాలు నిర్వహించనున్న వేళ…ఈ భేటీ ప్రాముఖ్యత సంతరించుకొంది. గతంలో ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ నాయకులు కూడా సీఎం కేసీఆర్ కలిసి భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు.
ఇవి కూడా చదవండి…
జనవరి 31..బడ్జెట్ సమావేశాలు
తపస్వి లక్షణం ఇది కాదు…బీజేపీ
ప్రజల ఆలోచన సరళి మారాలి..
- Advertisement -