బీఆర్ఎస్ అంటే బీజేపీకి భయం పుట్టిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడుతూ… బీఆర్‌ఎస్ అంటే బీజేపీకి బ్రెయిన్ డ్యామేజీ అయిందని అందుకే ఇష్టము వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీకి బుద్ధి చెప్తారు. యాగాలు చేయడం కేసీఆర్‌కు కొత్త కాదు. భారత రాష్ట్ర సమితికి దైవశక్తి అవసరం. కాబట్టే యాగాలు చేస్తున్నాం. రానున్న రోజుల్లో బీఆర్ఎస్‌లో చాలా రాష్ట్రాల నుంచి చేరికలు ఉంటాయని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా నిర్మల అడ్డుకుంటున్నారు. నిర్మలా సీతారామన్ వీక్ హిందీ గురించి కాకుండా వీక్ రూపి గురించి స్పందిస్తే మంచిదని కవిత అన్నారు. భాషపై దృష్టి కాకుండా ప్రజల సమస్యపై మా దృష్టి పెట్టాలని సూచించారు. భారత్ జాగృతి ద్వారా దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు అమలు చేస్తాం అని కవిత ప్రకటించారు. రాష్ట్రంలో తెలంగాణ జాగృతి కొనసాగుతోందని తెలిపారు.
జాతీయ స్థాయిలో బీజేపీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాబోతోంది. బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేస్తామని తెలిపారు. బండి సంజయ్ తన పదవికి మచ్చ తెచ్చే విధంగా మాట్లాడుతున్నారు. మహిళలను అవహేళన చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సరైన సమయంలో ప్రజలు బీజేపీకి సమాధానం చెబుతారు. బండి సంజయ్ మాటలు బాధ కలిగిస్తున్నాయి. ఆయన బతుకమ్మను కూడా అవమానించారు అని కవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి…