శంషాబాద్ భూవివాదం..బీఆర్‌ఎస్ లీగల్ ఫైట్

13
- Advertisement -

శంషాబాద్ పరిసరాల్లో భూముల వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని బాధితులపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో వారితో కలిసి మీడియాతో మాట్లాడారు కేటీఆర్.

మంత్రి పొంగులేటికి శంషాబాద్‌లో మరో 250 ఎకరాలపై కన్ను పడిందన్నారు కేటీఆర్. శంషాబాద్‌లో రెవెన్యూ అధికారులు 250 ఎకరాల భూములను నిషేధిత జాబితాలో ఉంచారు అని..ఆ భూముల యజమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి ఎకరాకు రూ.2 కోట్లు అయినా ఇవ్వాలి లేదంటే 100 ఎకరాలైనా తనకు రాసి ఇవ్వాలని బెదిరిస్తున్నాడు అన్నారు.

ఈ దుర్మార్గులు భూముల కోసం మమ్మల్ని చంపేస్తామని అంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుండి అన్యాయానికి గురవుతున్న బాధితులందరికి మా లీగల్ టీం తరపున న్యాయ పోరాటం చేయడానికి అండగా ఉంటాం అని తెలిపారు.

Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!

- Advertisement -