ఐపీఎల్ 2026లో రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన పోరు ఆసక్తికరంగా సాగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మార్చి 29న జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శనతో సునాయాస విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 220 పరుగులు సాధించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ముంబై ఇండియన్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో గత 13 సంవత్సరాలుగా మొదటి మ్యాచ్ ఓడిపోతున్న ముంబైకు ఆ అపవాదు తొలగింది.
ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతూ 38 బంతుల్లో 78 పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్‌తో ఆయన ఒక ప్రత్యేక రికార్డును సాధించారు.ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ, ఒకే ఐపీఎల్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీను దాటారు.
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ జట్టు విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.చాలా కాలంగా ఎదురు చూస్తున్న విజయమిది. 13 సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం. ప్రతి సీజన్ ప్రారంభాన్ని విజయంతో మొదలుపెట్టాలని కోరుకున్నాం. ఈసారి సాధించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. పిచ్ పరిస్థితులను బట్టి పెద్ద లక్ష్యాలను ఛేదించడం ఇప్పుడు సాధారణమైంది. మా బౌలర్లు కూడా మంచి ప్రదర్శన చూపారు అన్నారు.
Also Readకొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!

