నటుడు ప్రకాశ్ రాజ్‌కు మాతృవియోగం

11
- Advertisement -

ప్రకాష్ రాజ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూశారు. సువర్ణలత (86) గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమె మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశ్ రాజ్‌కు తల్లితో ఎంతో అనుబంధం ఉంది. ఆమె మరణం కుటుంబానికి తీరని లోటుగా మారింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సానుభూతి తెలియజేస్తున్నారు.

Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!

ప్రకాశ్ రాజ్ అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ధైర్యం కలగాలని కోరుకుంటున్నారు.

- Advertisement -