రేవంత్ రామచిలుకలా బండి:బీఆర్ఎస్

9
- Advertisement -

కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు అన్నారు మాజీ మంత్రి గంగుల.ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉందనుకుని, బండి సంజయ్ ప్రతి రోజూ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారా?, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా లేక ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందా అనే అనుమానం వస్తుంది అన్నారు.

కమలాకర్ చెప్పిన బండి సంజయ్, మరి మీ బీజేపీ పార్టీ జాతీయ హోదా ఇచ్చి కట్టిన పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే ఇజ్జత్ పోలేదా? చెప్పాలన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కుప్పకూలి మనుషులు చనిపోయినా, ఖమ్మం జిల్లా పెద్ద వాగు కొట్టుకుపోయినా, సుంకిషాల కూలిపోయినా ఇప్పటివరకు బీజేపీ ప్రశ్నించదు, ఒక్క ఎంక్వైరీ కమిషన్ ఉండదు అన్నారు.

రేవంత్ రెడ్డి రామచిలుకలా బండి సంజయ్ మారి మాట్లాడుతున్నాడు అన్నారు ఎమ్మెల్సీ బండి సంజయ్. బీజేపీ నేతలందరూ ఒకచోట సభ పెట్టుకుంటే, ఆ మీటింగ్ కు బండి సంజయ్ పోకుండా తన ఎజెండాను తెరపైకి తెచ్చాడు…గోదావరి నీళ్ళను ఎత్తుకుపోతుంటే.. గోదావరి నీళ్లు తాగి పెరిగిన బండి సంజయ్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు మాట్లాడుతున్నాడు అన్నారు. రేవంత్ రిమోట్ నొక్కితే ఎగిరే తోలు బొమ్మ బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు.

రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఓట్లేసిన తమ సొంత ప్రజలకు బీజేపీ ఎంపీలు ద్రోహం చేస్తున్నారు అన్నారు ఎమ్మెల్యే సంజయ్. మీ చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ నుంచి గోదావరి నీళ్లను తరలించే కుట్రలకు సహకరించకండి అన్నారు.

Also Read:ఇజ్రాయెల్ నుండి ఢిల్లీకి!

- Advertisement -