- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా MLA క్వార్టర్స్ ప్రాంగణం లో క్వార్టర్స్ లో పని చేసే వారికి నెలకు సరిపడు నిత్యావసర సరుకులు పంపిణి చేశారు BRS రాష్ట్ర నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్.
ఈ రోజు క్వార్టర్స్ లో పని చేసే వారికి ఒక నెలకు సరిపడు బియ్యం బస్తా,5కేజీ నూనె మరియు నిత్యావసర సరుకులు పంపిణి చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఉన్నంతలో పేద వాళ్లకు సహాయం అందించడం అనేది జోగినపల్లి సంతోష్ కుమార్ గారిని చూస్తూ మేము కూడా భాగస్వామ్యం అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమం లో మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,అసెంబ్లీ LP రమేష్, K వాసు దేవరెడ్డి, K దీరజ్, నటుడు రాకింగ్ రాకేష్ మరియు పలువురు పాల్గొన్నారు.
Also Read:ఆ దర్శకుడు ఓ పనిరాక్షసుడు అట
- Advertisement -