ఓపెన్‌గా చెప్పేస్తున్న జయసుధ

31
- Advertisement -

సహజనటి జయసుధ ప్రస్తుతం సినిమాల్లో మళ్లీ బిజీ కావాలని అనుకుంటున్నారు. కానీ, ఆమెకు ఆశించిన స్థాయిలో రెమ్యునరేషన్ ను ఇవ్వడం లేదు మేకర్స్. నేనెందుకు తక్కువకి నటించాలి? … నేను డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నాను. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అది చెప్పడానికి నాకేమీ నామోషీ కూడా లేదు. ఎవరైనా వచ్చి ‘జయసుధ గారు మా సినిమాలో మీకు అద్భుతమైన పాత్ర ఉంది ! చాలా గొప్ప పేరు వస్తుంది. కాకపోతే, మీరు తక్కువ రెమ్యునరేషన్ కి ఈ సినిమా చేయాలి’ అని అంటే.. ‘నాకు ఆ క్యారెక్టర్ అక్కర్లేదు’ అని నేరుగా చెప్పేస్తాను‌. ఇలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. జయసుధకి పొగరు అన్నారు. కానీ, జయసుధకి తన విలువ ఏమిటో బాగా తెలుసు.

అసలు జయసుధ గురించి పక్కన పెడదాం. ఓ నటిని తెర మీద చూపించి మీరు డబ్బు వసూలు చేస్తున్నప్పుడు ఆ నటి ఎందుకు తక్కువ రెమ్యునరేషన్ కి నటించాలి? ఇదేమైనా దానమా, ధర్మమా?. జయసుధ అనే ఆర్టిస్ట్ బాగా నటిస్తోంది అనుకుంటేనే కదా.. ప్రేక్షకులు కూడా వచ్చి సినిమా చూస్తారు. అలాంటప్పుడు ఎందుకు తగ్గాలి?, ఒక నటిగా సినిమా కోసం కష్టపడుతున్నాను. నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలి. కావాలంటే కాస్త ఎక్కువో ఇవ్వండి. అంతేగాని, తక్కువ ఇస్తాను అంటే మాత్రం.. నేను ఇక నటించను అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తుంది జయసుధ.

ఇదంతా ఓ చిన్న సినిమా విషయంలో జరిగింది. ఆ చిన్న సినిమా నిర్మాత జయసుధ గారి దగ్గరకు వెళ్లి.. మీకు అద్భుతమైన పాత్ర ఉంది, రెమ్యునరేషన్ విషయంలో కొంచెం సపోర్ట్ చేయాలి అని రిక్వెస్ట్ చేశారు. అంతే.. ఆ మాటకు జయసుధ విరుచుకు పడ్డారు. ‘నేను డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు. తృప్తి కోసం చేస్తున్నాం’ అనేది అబద్ధం. ఎవరూ ఎవరికీ ఇక్కడ ఏదీ ఉచితంగా చేయరు. ఏదైనా ఉచితంగా చేసినా, అందులో ఏదో ఒక లాభం ఆశిస్తారు అంటూ జయసుధ చాలా విషయాలే చెప్పారు. చివరకు సదరు నిర్మాత నోరు మూసుకొని వెళ్లిన దారినే తిరిగొచ్చారు.

Also Read:ఆ దర్శకుడు ఓ పనిరాక్షసుడు అట

- Advertisement -