బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. తొలుత సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, మంత్రులు కేటీఆర్,మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.
ఇక ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయం సాధించిన తొలి దక్షిణ భారత సీఎంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రికార్డు సృష్టిస్తారని అన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో స్పష్టమైన రాజకీయ శూన్యత ఉందని, దీనిని 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ భర్తీ చేస్తుందన్నారు.
బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అని, 2023 డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 100 నియోజకవర్గాల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read:జై కేసీఆర్..జై భారత్
బీఆర్‌ఎస్ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, బీజేపీతో పొత్తు పెట్టుకోదని, రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో రెండు పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read:అవకాశాలు ఎందుకివ్వరు?