ఉరూరా గులాబీ జెండా పండుగ

88
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా పండుగను టీఆర్‌ఎస్‌ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. పల్లెపల్లెనా, వాడవాడనా నేతలు టీఆర్‌ఎస్‌ జెండాలను ఎగుర వేసి.. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని… ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో వాడవాడనా బీఆర్‌ఎస్‌ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు.

జై తెలంగాణ, జై భారత్‌, జై కేసీఆర్‌ నినాదాలతో పట్టణాలు, పల్లెలు అని తేడాలేకుండా మారుమోగుతున్నాయి. ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించిన తర్వాత పార్టీ కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసే ప్రతినిధుల సభకు చేరుకుంటున్నారు. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొననున్నారు.

Also Read:IPL 2023 : ఎస్‌ఆర్‌హెచ్ కు.. వార్నర్ శాపం తాకిందా!

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా ఎలా కార్యోన్ముఖులను చేయాలి? స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించిన విజయ పరంపర, రాష్ర్టానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసం తదితర అంశాలపై తీర్మానాలు చేయనుంది.

Also Read:టీటీడీ రూ.300 దర్శన టికెట్స్ రిలీజ్..

- Advertisement -