కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి అన్నారు మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనచారి. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మధుసూదనచారి.. మాట తప్పడం , మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు. అన్ని వర్గాలను వంచించినట్టు విద్యార్థులను మోసం చేశారు…స్టేషన్ ఘన్పుర్ సభలో మేం ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.
డిగ్రీ, ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలి.. ఇచ్చిన హామీలు సమీక్షించుకోండి అన్నారు. దేశంలో అనేక పార్టీలు అనేక హామీలు ఇస్తాయి..కానీ చెప్పని హామీలు సైతం అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది మాత్రమే.. ఇచ్చిన హామీలు అమలు చేయండి లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు..కేసిఆర్ గారి ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపింది అన్నారు. మళ్ళీ సమస్యలకు కేంద్రంగా తెలంగాణ మారుతుంది..ఆడపిల్లలకు వెంటనే స్కూటీలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయ్యింది..నిన్న తులం బంగారం ఇయ్యమని శాసనమండలి సాక్షిగా చెప్పారు అన్నారు ఎమ్మెల్సీ కవిత. నేడు ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పని చేస్తున్నారు..లక్ష 50 వేల కోట్ల అప్పు చేశారు హామీలు విస్మరించారు..ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు రాస్తున్నారు విద్యార్థినీలు..ఇప్పటికైనా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
Also Read:TTD: 25న కోయిల్ అల్వార్ తిరుమంజనం