- Advertisement -
కేంద్రమంత్రికి ఆయన కొడుకు బండి భగీరథ్‌కు మంచి బుద్ధి ఇవ్వాలి అని బీఆర్ఎస్ మహిళా నేతలు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు చేశారు. కేంద్రమంత్రికి భాగ్యలక్ష్మి టెంపుల్ అంటే ఎంతో ఇష్టం.. అందుకే ఇక్కడికే వచ్చాం…చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.
ఆయనకు మంచి బుద్ది వచ్చి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము… ట్రాన్సపరెంట్‌గా ఇన్వెస్టిగేషన్ జరగాలి.. ప్రభుత్వం ఒత్తిడులకు లొంగకుండా నిజాలు బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు.
క్యాబినెట్‌లో కొనసాగేందుకు నైతిక హక్కు లేదు.. కేంద్ర మంత్రిగా బర్తరఫ్ చేయాలి… అమ్మవారి సాక్షిగా నిజం బయటపడాలి… మైనర్ బాలిక అంశంలో రాజకీయ ప్రభావం ఉండకూడదు అని బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు.
Also Read:చైనాలో పుతిన్ పర్యటన
- Advertisement -

