తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి.. నామినేటెడ్ పోస్టులపై పెదవి విరిచారు. చెప్పులు మోసిన వాడికి సుడా ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారు.. వాడికి ఏం అర్హత ఉంది అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
పరోక్షంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గం నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అర్హత ఉందని పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌కు ఖమ్మం సుడా ఛైర్మన్ ఇచ్చారు.. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ నేతలకు అవకాశం లేదు అని ఆరోపించారు.
హూ ఇజ్ థట్ ఫెలో పువ్వాళ్ల దుర్గాప్రసాద్? ఒక వ్యక్తికి చెప్పులు, సంచులు మోసినోడు అని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ. .ఖమ్మం జిల్లాలో నామినేటెడ్ పోస్టులు, పార్టీ కమిటీలను వేయగా ఇందులో రేణుకా వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Also Read:చైనాలో పుతిన్ పర్యటన

