ముందస్తు విజయానందంలో ‘బిఆర్ఎస్ హాట్రిక్’ అభ్యర్థులు..

36
- Advertisement -

‘లక్షలాది సైన్యమూ వద్దు, ఎటువంటి గజబలం గానీ, రథ బలంగానీ, అశ్వబలం గానీ, వందలాది అక్షౌహిణుల సైన్యమూ కానీ మాకు వద్దే వద్దు… మావైపున వొక్క కృష్ణుడుంటే సాలు.. మా విజయం ఖాయం..’అని నాడు పాండవులు కోరుకున్నట్టు.. తమకు కేసీఆర్ వొక్కడుంటే చాలు, లక్షల అక్షౌహిణులతో సమానం…రాబోయే ఎన్నికల్లో తాము అత్యధిక మెజారిటీతో గెలిచేందుకు హాట్రిక్ విజయాన్నిసాధించేందుకు కేసీఆరే మా బలం బలగం అనే భరోసాను, ధీమాను, తొణికిసలాడే విశ్వాసాన్ని బిఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకే మళ్లీ అవకాశమివ్వడం తో గెలుపు పట్ల ‘బిఆర్ఎస్-2023’ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో విశ్వాసం గ్రాఫ్, రాకెట్ లా దూసుకుపోతున్నది. అధినేత తమను మల్లీ గుర్తించడం తో వారిలో గెలుపు తాలూకూ నమ్మకం పెరిగిపోయింది. వారంతా ఫుల్ జోష్ లో వున్నారు. సిట్టింగులకే సీట్లిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి తన మాట నిలబెట్టుకోవడం తో వారు ఉబ్బితబ్బిబ్బవుతూ అధినేతను కలసి తమ కృతజ్జతాభివందనాలు తెలుపుకుంటున్నారు.

అభ్యర్థుల జాబితా విడుదల చేసిన మరుక్షణం నుంచి మొదలైన వారి ధన్యవాదాల వెల్లువ మంగళవారం కూడా కొనసాగింది. ఈ మేరకు పూలబొకేలు శాలువాలతో ప్రగతి భవన్ చేరుకున్న అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు ఆయా జిల్లాల నేతలతో ప్రగతి భవన్లో సందడి నెలకొంది. తమ అధినేత సిఎం కేసీఆర్ నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటూ, భుజం మీద చేతులు వేయించుకోని మరీ ఫోటోలు దిగుతూ తమ కృతజ్జతలను చాటుకున్నారు. భరోసాను పొందుతున్నారు. అధినేత ఆశీర్వాదం తీసుకుని భారీ మెజారిటీతో రాబోయే ఎన్నికల్లో హాట్రిక్ విజయాన్ని సాధించేందుకు తమ నాయకున్ని హాట్రిక్ ముఖ్యమంత్రిని చేసేందుకు సన్నద్దులవుతూ ముందుకు సాగుతున్నారు.

Also Read:ఆ ఇద్దరిలో భయం భయం..కమలంలో కంగారు?

నమ్మశక్యం కాని విషయం :

ఎన్నడూ ప్రకటించని రీతిలో వొకే సారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం, భారత దేశ ఎన్నికల చరిత్రలోనే, సిఎం కేసీఆర్ సృష్టించిన అరుదైన రికార్డు. దేశ రాజకీయ చరిత్రలోనే నభూతో అని చెప్పుకోవచ్చు. అంతే కాకుండా అందులో వందమంది దాకా సిట్టింగులే కావడం ఇంకా అందులో మెజారిటీ అభ్యర్థులు మూడోసారి అభ్యర్థులుగా అధినేత మనసు గెలవడం మరో గొప్ప విషయం.
ఇప్పటికే అనేక అంశాల్లో నెంబర్ వన్ గా నిలిచి చరిత్ర సృష్టిస్తున్న కేసీఆర్ మోడల్ పాలన., ఎన్నికల రంగంలోనూ తనదైన ముద్ర వేస్తూ, రాజకీయ విశ్లేషకులను విమర్శకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలవడం తెలంగాణకే కాదు దేశానికే గర్వ కారణం గా నిలిచింది.

ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్ – 3 విజయవంతంగా సేఫ్ లాండింగ్ జరిగే ప్రక్రియకన్నా వొక్కరోజు ముందే…‘తెలంగాణ చంద్రయాన్ -3’ విజయవతంగా సేఫ్ లాండ్ అయింది. అభ్యర్థుల జాబితా విడుదల ప్రక్రియతో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కక్ష్యలోని ముఖ్యఘట్టం అత్యంత్ సేఫ్ లాండింగ్ జరిగింది. ఎటువంటి ఆందోళనలు డిస్టబెన్సులు లేకుండానే కుదుపులకు లోనుకాకుండా సేఫ్ లాండ్ కావడం ద్వారా తెలంగాణ ప్రజల మనసులను గెలిచింది. తెలంగాణ భవిష్యత్తుకు వో భరోసానిచ్చింది. ఇక రాబోయే ఎన్నికల్లో ఫలితాలను రాబట్టడం అనే ప్రక్రియను ఈ సేఫ్ లాండింగ్ నల్లేరు మీద నడకగా మార్చేసింది. రాష్ట్రంలో బిఆరెస్ కు ప్రధాన ప్రతిపక్షం అనే వూసును కూడా ఈ అభ్యర్థుల ప్రకటన వూడ్చేసింది. అభ్యర్థుల ప్రకటన గాలిలో ప్రతిపక్షాలు తేలిపోయాయి. యుద్దాన్ని ప్రారంభించక ముందే పూరించిన శంఖారావ ప్రతిధ్వని ప్రతిపక్షాల గుండెల్లో గుబులు రేపింది. యుద్దం చేయకముందే ప్రత్యర్థిని వోడించిన దార్శనికతతో అత్యంత సూక్ష్మజ్జానంతో కూడిన సైద్దాంతిక తాత్వికతతో బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రదర్శించిన రాజనీతి కి దేశ రాజకీయ విమర్శక లోకం జయహోలు పలుకుతున్నది.

Also Read:కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడో మరి?

- Advertisement -