BRS:బి‌ఆర్‌ఎస్ ‘వ్యూహం’.. మెజారిటే లక్ష్యం!

22
- Advertisement -

రాబోయే లోక్ సభ ఎన్నికలపై బి‌ఆర్‌ఎస్ పార్టీ బలంగా దృష్టి సారిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం లోక్ సభ ఎన్నికల్లో రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతోంది. లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 10-15 స్థానాలకు పైగా సీట్లు సాధించే దిశ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు అధినేత కే‌సి‌ఆర్. ఆ మద్య పలువురు అభ్యర్థులను ఫైనల్ చేయగా.. తాజాగా మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను మాజీలకే కట్టబెట్టారు అధినేత. అందువల్ల ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మేల్యేలు మళ్ళీ ఎన్నికల బరిలో నిలవడంతో ఓట్లలో చీలిక ఏర్పడి ఓటమి తప్పలేదు.

అందువల్ల ఆ తప్పును లోక్ సభ ఎన్నికల్లో రిపీట్ చేయకుండా జాగ్రత్త వహిస్తున్నారు. వరంగల్, నిజామాబాద్, చేవెళ్ళ, జహీరాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి వంటి స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కే‌సి‌ఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత స్థానంలో ఈసారి బాజిరెడ్డి గోవర్ధన్ ను బరిలోకి దించనుంది. అలాగే చేవెళ్ళలో గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన రంజిత్ రెడ్డిని కూడా పక్కన పట్టే ఆయన స్థానంలో ఇటీవల బి‌ఆర్‌ఎస్ లోకి చేరిన కాసాని జ్ఞానేశ్వర్ కు టికెట్ అప్పగించారు.

ఇలా సిట్టింగ్ ల విషయంలో చాలనే మార్పులు చేసింది బి‌ఆర్‌ఎస్ అధిష్టానం. గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ తొమ్మిది స్థానాల్లో విజయం సాదించగా.. ఈసారి అంతకు మించి సీట్లు సాధించే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీలో ఉన్నప్పటికి, బీజేపీ తరపున బలమైన అభ్యర్థులు లేకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొనడం.. వంటి కారణాలు బి‌ఆర్‌ఎస్ కు కలిసొచ్చే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. మరి లోక్ సభ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ఎన్ని సీట్లు సొంతం చేసుకొని ఇతర పార్టీలకు షాక్ ఇస్తుందో చూడాలి.

Also Read:జాన్వీ కపూర్ చాలా అరుదు

- Advertisement -