మూసీ సుందరీకరణ హైడ్రా బాధితులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని బీఆర్ఎస్ లీగల్ సెల్ పేర్కొంది. మీకు తోడుగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఉందని…మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అన్ని విషయాలు మేమే చూసుకుంటాం, మీకు అండగా ఉంటాం అని స్పష్టం చేసింది.
తెలంగాణ భవన్‌కు మూసీ సుందరీకరణ బాధితులు.. బాధితులకు భరోసా కల్పించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు. పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు, మా గుండె ఆగిపోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
కంటిమీద కునుకు ఉండట్లేదని, మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్దం కావట్లేదు. దయచేసి మాకు న్యాయం చేయండి అంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అవసరమొచ్చినా.. మా తలుపులు తెరిచే ఉంటాయి. 24 గంటలు మా న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్‌లోనే ఉంటుందన్నారు. మీకు మేమంతా రక్షణ కవచంగా నిలబడతాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి మీ దగ్గరికొస్తాం అంటూ బాధితులకు భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు.
Also Read:Harishrao: బుల్డోజర్ రాజ్ నహీ చలేగా!