బ్రదర్స్ & సిస్టర్స్ డే

54
- Advertisement -

జీవితం చాలా చిన్నది. చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ అయి బంధాలను దూరం చేసుకుంటాం. అది అన్నదమ్ములైనా, అన్నా చెల్లెలైనా,స్నేహితులైనా. చిన్న చిన్న విషయాలను పెద్దది చేసుకుని దూరం అవుతుంటాం. అయితే అలా దూరమైన బంధాలను కలుపుకునేందుకు ఓ ప్రత్యేకమైన రోజు ఉంటుంది. ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండి షిప్ డేలాగా ఇవాళ కూడా బ్రదర్స్ & సిస్టర్స్ డే.

తోబుట్టువులు ఒకరినొకరు తిరిగి కలవడం కోసం ఈ జాతీయ సోదర,సోదరీమణుల దినోత్సవం ఏర్పడింది. మంచి, చెడుల విషయాలను మాట్లాడుకోవడం, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఈ రోజు ప్రత్యేకత. అన్నా, చెల్లెలి మధ్య ఉండే ఆప్యాయత,వారు గుర్తుకొచ్చిన సందర్భాలు చూసి ఏడ్చిన రోజు ఉండే ఉంటుంది. అందుకే ఈ రోజు ఫాదర్స్‌ డే, మదర్స్‌ డే లాగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డే ఏర్పడింది.

Also Read:కీళ్ళ నొప్పులు తగ్గడానికి చిట్కాలు..

జాతీయ తోబుట్టువుల దినోత్సవం కేవలం సోదరులు మరియు సోదరీమణులు మాత్రమే కలిగి ఉండే బంధాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి ఏర్పడింది. మీ సోదరుడు లేదా సోదరి రోజులు, నెలలు లేదా సంవత్సరాలలో మాట్లాడకున్నా ఈరోజు వారికి కాల్ చేసి 10 నిమిషాలు మాట్లాడండి లేదా కలిసి సినిమా చూడటానికి వెళ్లండి. కుటుంబంతో గడిపిన సంతోషం ఉంటుంది. చాలా కుటుంబాలలో అన్నా- చెల్లెలు మంచి స్నేహితులుగానే ఉంటారు. కానీ మధ్యలో కొన్ని అనుకోని సంఘటనల వల్ల దూరమైన వారికి అనుబంధాన్ని గుర్తించడానికి ఈ రోజు ఏర్పడింది. కాబట్టి ఇంకేందుకు ఆలస్యం మీ అన్ననో,తమ్ముడినో,అక్కా-చెల్లెలినో మిస్సైన ఫీలింగ్ ఉంటే వెంటనే వారిని కలవడం లేదా కాల్ చేసి మాట్లాడండి. ఇది కుటుంబ బంధాలను మరింత దృఢం చేసేదిగా దోహదపడుతుంది.

Also Read:IPL 2023:కోహ్లీ గంభీర్ మద్య గొడవ.. ఇప్పట్లో తగ్గదా?

- Advertisement -