బ్రో..ఇంకా 10 భాషల్లో చేస్తాడట

58
- Advertisement -

పవన్‌ కళ్యాణ్, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ చిత్రాన్ని సముద్రఖని తెరకెక్కించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే, తాజాగా బ్రో సినిమాను ఇంకా 10 భాషల్లో చేస్తానని దర్శకుడు సముద్రఖని చెప్పారు. ప్రతి భాషలోనూ అక్కడి స్టార్స్ తో.. అక్కడి బడ్జెట్ కి తగినట్టుగానే బ్రో సినిమా చేస్తానన్నారు. నెక్స్ట్ హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. సమయం అనే కాన్సెప్ట్ తో చేసిన సినిమా కాబట్టి బ్రో పేక్షకులకి అందరికి కనెక్ట్ అయిందన్నారు.

మొత్తానికి తెలుగులో బ్రో అనూహ్య విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విజయంపై సాయిధరమ్ తేజ్ తాజాగా స్పందిస్తూ ‘మా మామయ్య పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం కల్పించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. మంచి చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను ‘బ్రో’ చిత్రబృందం దర్శించుకుంది. సాయిధరమ్‌ తేజ్‌, దర్శకుడు సముద్రఖని తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి తేజ్ హిట్ పట్ల సంతృప్తిగా ఉన్నామని చెప్పుకొచ్చాడు.

Also Read:సీఎం నమ్మకాన్ని నిలబెడుతా:దాసోజు

కాగా.. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా నటించిన మల్టీ స్టారర్ చిత్రం బ్రో. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఫస్ట్ డే.. రూ.48.09 కోట్లు, సెకండ్ డే.. రూ.27.61 కోట్లు, థర్డ్ డే.. రూ.25.84 కోట్లు.. మొత్తంగా రూ.101.54 కోట్ల కలెక్షన్లతో సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Also Read:వర్షపు నీటిలో తడవడం మంచిదేనా..?

- Advertisement -