చైనానే బ్రిటన్‌ ప్రధాన శత్రువు : రిషి సునాక్‌

138
rishi
- Advertisement -

ఇటివల కాలంలో బ్రిటన్‌ రాజకీయ సంక్షోభం ఎదుర్కోంటుంది. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామాతో సంక్షోభం మరింత ముదిరింది. కాగా ప్రస్తుతం బ్రిటన్‌ లో ప్రధాని కోసం ఇటీవల కన్జర్వేటీవ్‌ పార్టీ ఎన్నికలు నిర్వహించారు. ప్రధాని రేసులో తొలి స్థానంలో రిషి సునాక్‌ ఉన్నారు. ఈ పదవి కోసం భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్‌ పోటిలో ఉన్నారు. తాజాగా అయన చైనాపై తన మనసులోని మాటలు బయటపెట్టారు. బ్రిటన్‌ ప్రధాన శత్రువు చైనా అనిపేర్కొన్నారు. చైనా నుంచి ఎప్పటికైనా బ్రిటన్‌కు, ప్రపంచానికి పెను సవాలుగా మారుతుందన్నారు.

యూకే జాతీయ, అంతర్జాతీయ భద్రతకు చైనా నుంచి ముప్పు ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఇదే విషయంపై ఒక ప్రతిపాదన చేసిన రిషి.. చైనా గూఢచారులను ఎదుర్కోవడానికి యూకే గూఢచార వ్యవస్థను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, దేశంలోని కన్‌ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్లను కూడా పూర్తిగా మూసేయాలని సూచించారు.

- Advertisement -