- Advertisement -
బ్రిటన్లోని భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పారు అక్కడి అధికారులు. గతంలో కోవీషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బ్రిటన్ వచ్చే భారతీయులు తప్పని సరిగా 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని షరతులు విధించగా భారత్ హెచ్చరికలతో వెనక్కి తగ్గింది బ్రిటన్.
ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతులు పొందిన వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా 10 రోజులు క్వారంటైన్ విధించడం సమంజసం కాదని తెలిపింది. క్వారంటైన్ ఆంక్షలు విధిస్తే తాము కూడా అదే బాటలో నడుస్తామని ప్రకటించింది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం దిగివచ్చింది. షరతులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈనెల 11 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
- Advertisement -