టీమిండియాపై మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు..

210
- Advertisement -

లార్డ్స్‌లో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ భారత జట్టును అభినందించారు. ఈ గెలుపు.. నిజంగా అద్భుతం’’ రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్‌.. ఉత్కంఠ విజయం సాధించిందని మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

ఆహా.. ఏమి విజయం! అద్భుతమై టెస్ట్‌ మ్యాచ్‌లో అమోఘమైన విజయం. టీమిండియా అదరగొట్టేసింది. మన పేసర్లకు అభినందనలు. ముఖ్యంగా మన హైదరాబాదీ సిరాజ్‌ మాయ చేశాడు. షమి, బుమ్రా బాల్‌తో పాటు బ్యాట్‌తోనూ మేజిక్‌ చేశారు. ఇషాంత్‌.. నిలకడగా ఆడాడు. ఇది.. టెస్ట్‌ మ్యాచ్‌లోని నిజమైన మజాను అందించింది. క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే కేటీఆర్‌.. భారత్‌ సాధించిన విజయాన్ని ఆస్వాదించానని తెలిపారు.

- Advertisement -