‘శ్రీదేవి సోడా సెంటర్’ నుండి అదిరిపోయే సాంగ్ వచ్చేసింది..

130
- Advertisement -

టాలీవుడ్‌ హీరో సుధీర్ బాబు తాజాగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో నటించాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 27వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

‘చుక్కల మేళం .. దిక్కుల తాళం .. ఒక్కటయే ఈ సంబరం .. ఆ సాంతం నీ సొంతం’ అంటూ ఈ పాట సాగుతోంది.. మణిశర్మ సంగీతం అందించగా.. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపనతో ఈ పాట సాగింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ. సుధీర్ బాబు కొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఆనంది మరింత అందంగా కనిపిస్తోంది.

- Advertisement -