ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు తదుపరి శాశ్వత కెప్టెన్ వేటలో ఉన్న వేళ… స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కు ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తన పూర్తి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో ఇంగ్లాండ్ టెస్ట్ జట్టును నడిపించే అత్యుత్తమ సామర్థ్యం బ్రూక్‌కు ఉందని ఆయన కొనియాడారు.
ఇంగ్లాండ్ క్రికెట్ ప్రస్తుతం భారీ మార్పులకు గురవుతోంది. బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) నూతన టెస్ట్ కెప్టెన్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ప్రస్తుతం సీనియర్ బ్యాటర్ జో రూట్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎస్సీబీ ఒక యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించాలని యోచిస్తోంది. ఈ రేసులో హ్యారీ బ్రూక్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు.
హ్యారీ బ్రూక్ నాయకత్వ పటిమపై బ్రెండన్ మెకల్లమ్ స్పందిస్తూ.. హ్యారీ బ్రూక్ అంటే నాకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అతనొక అద్భుతమైన ఆటగాడు. ప్రస్తుతం వైట్-బాల్ (పరిమిత ఓవర్ల) జట్టు నాయకుడిగా చాలా బాగా రాణిస్తున్నాడు. టెస్ట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే సమయం కూడా త్వరలోనే వస్తుంది. భవిష్యత్తులో అతను అత్యంత కీలక పాత్ర పోషిస్తాడు. అయితే, ప్రస్తుతానికి తాత్కాలిక కెప్టెన్‌గా జో రూట్ అద్భుతమైన పనితీరును కనబరుస్తాడు అని తెలిపారు.
2022లో బాధ్యతలు చేపట్టి ‘బాజ్‌బాల్’ శైలితో టెస్ట్ క్రికెట్‌లో సంచలనం సృష్టించిన మెకల్లమ్… తన నాలుగేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత కోచింగ్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. ఇంగ్లాండ్ నూతన టెస్ట్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎంపికయ్యారు. నాలుగేళ్ల నా పదవీకాలం చాలా అద్భుతంగా సాగింది. ఇప్పుడు జట్టు కొత్త దిశగా పయనిస్తోంది. ఫ్లెమింగ్ అత్యుత్తమ కోచ్. ఆయన నా లాంటివారే కాకపోతే నాకంటే మెరుగైన ఆలోచనాపరుడు. ఫ్లెమింగ్ సేవలను ఇంగ్లాండ్ క్రికెట్‌కు అంది పుచ్చుకోవడంలో ఈసీబీ చాలా గొప్ప పనిచేసింది. ఆయన ఆధ్వర్యంలో జట్టు మరింత ఎత్తుకు ఎదుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read:కాంగ్రెస్‌కు సీపీఐ కూనంనేని తీవ్ర హెచ్చరిక

