ఉదయాన్నే ఫ్రూట్స్ తింటున్నారా?

79
- Advertisement -

కరోనా తర్వాత ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి తాజా కూరగాయలు, పండ్లను మాత్రమే తింటున్నారు అయితే ఆహార అలవాట్లు మార్చుకోవడం వరకు బాగానే ఉన్న డాక్టర్ల సలహా మేరకే ఆరోగ్యంపై జాగ్రత్త వహిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది ఉదయం పూట టిఫిన్ మానేసి..పండ్లను ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే ఇది చాలా ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.పరగడుపున ఫ్రూట్స్ ను అల్పాహారంగా తీసుకుంటే యసిడిటీ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాదు పండ్లు మాత్రమే తింటే బ్లడ్ లో షుగర్ లెవల్స్ కూడా డౌన్ అయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

Also Read: బీజేపీ ” సినీ గాలం “.. వర్కౌట్ అవుతుందా ?

ఇక ఉదయమే ఫూట్స్ తింటే మలబద్ధకం సమస్య కూడా తలెత్తవచ్చు. కాబట్టి మన శరీరానికి పూర్తి శక్తి అందాలంటే ఉదయం పూట అల్పాహారం తినడం చాలా ఉత్తమం. పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి కదా..మరి ఆరోగ్యం ఎందుకు దెబ్బ తింటుందని మీకు సందేహాలు కలుగుతున్నాయి కదా..ఫ్రూట్స్ ద్వారా మనకు పోషకాలు లభిస్తాయి ఇందులో డౌట్ అక్కర్లేదు కానీ బ్యాలెన్డ్స్ డైట్ మాత్రం మనకు లభించదు.

Also Read:  నిమ్మకాయ ఎక్కువగా తింటే ప్రమాదమా?

- Advertisement -