- Advertisement -
కరోనాతో బ్రెజిల్ అతలాకుతలం అవుతోంది. గత 24 గంటల్లో 540 మంది మృత్యువాతపడగా ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 94 వేలకు చేరువయ్యాయి. బ్రెజిల్‌లో 27 లక్షల 33 వేల 677 పాజిటివ్ కేసులు నమోదుకాగా 94,104 మంది మృత్యువాత పడ్డారని ఆ దేశ వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.
బ‌్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనరో భార్య మిచ్చెల్లికి కరోనా పాజిటివ్ రాగా ఆమె హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే బ్రెజిల్ అధ్యక్షుడికి కూడా కరోనా సోకగా కొన్ని వారాల పాటు ఆయన క్వారంటైన్‌లో ఉన్న అనంతరం టెస్టులు చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది.
వారం క్రితం కిందట 87వేలు ఉండగా, 7వేల మరణాలు ఒకే వారంలో సంభవించాయి. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 1.8 మిలియన్లకుపైగా ప్రజలు కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
- Advertisement -