శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల శోభ

13
- Advertisement -

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శోభ సంతరించుకుంది. ఇవాళ్టి నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో సుందరంగా శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని తీర్చిదిద్దారు.

సమర్పణ, శ్రద్ధా నిబద్ధతలతో 11 రోజుల పాటు అర్చనలు, విశేష పూజలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికోత్సాహంతో మధుర మైమరపింపచేస్తోంది.

బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీశైలం దేవస్థానం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోంది.

భక్తుల ఆకలి తీర్చేందుకు అన్న ప్రసాదం పంపిణీ చేయనుంది. అన్నపూర్ణ భవన్‌లోని హాల్‌-1, హాల్‌-2లలో శివ భక్తులకు, సాధారణ భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మూడో నంబర్ హాలులో పోలీసులకు, నాలుగు, ఐదో నంబర్ హాళ్లల్లో కళాకారులు, వీఐపీలకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు అన్న ప్రసాదం పంపిణీ జరగనుంది. అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ అన్న ప్రసాదం అందజేస్తారు.

Also Read:పోలీస్ భద్రత కల్పించరా?: జగన్ ఫైర్

- Advertisement -