వైరల్..గుండు పిన్నుపై గణపతి

2
- Advertisement -

దేశవ్యాప్తంగా వినాయకచవితి సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ ప్రాంతాల్లో వెరైటీ గణపతులు దర్శనమివ్వగా తాజాగా గుండు పిన్నుపై బ్రహ్మోస్ మిస్సైల్ గణపతి దర్శనమిచ్చారు.

జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత దయాకర్ ఈ అద్భుతం చేశారు. బ్రహ్మోస్ మిస్సైల్ ని గనాథుడు చేతిలో పట్టుకున్నట్లు గుండు పిన్నుపై తయారు చేశారు సూక్ష్మ కళాకారుడు దయాకర్.

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇండియా శక్తిని ప్రపంచానికి బ్రహ్మోస్ మిస్సైల్ చాటి చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వగా తొలిపూజ చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తొలిపూజ తర్వాత భక్తుల దర్శనం ప్రారంభంకాగా ఉదయం నుంచే భక్తుల రద్దీ మొదలైంది.

Also Read:OG:ఓజీ సెకండ్ సింగిల్

- Advertisement -