స్టార్ల సినిమాల్లోనైనా.. చోటా మోటా హీరోల మూవీలోనైనా. చెంపదెబ్బలకు ఆయనిచ్చే రియాక్షన్స్ కి థియేటర్లు దద్దరిల్లేవి. సినిమాల్లో ఆయనను వాడుకుంటూ పండించే వినోదానికి కాసులు రాలాయి. దశాబ్దాలుగా ఇండస్టీని నవ్వులతో ముంచెత్తాడు. కామెడీకి కేరాఫ్ గా మారాడు. బ్రహ్మీ ఉంటే చాలు సినిమా హిట్ అనే పాజిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ కు ముందే ఆడియెన్స్ లోకి వెళ్లేవి. అంతలా ఇండస్టీలో ముద్ర వేశాడు నవ్వుల బ్రహ్మానందం. కానీ ఇపుడు పరిస్థితి మారుతుంది. బ్రహ్మీ అవసరం లేకుండానే సినిమాలు ఆడేస్తున్నాయి.
ఒకప్పుడు స్టార్ హీరో సినిమాల్లో మాస్ట్ గా ఉండాల్సిన క్యారెక్టర్. ఇపుడు సైడ్ అయిపోతుంది. బ్రహ్మీ లేకుండానే సినిమాలు రిలీజవుతున్నాయి. ఆయన కామెడీ లేకుండానే హిట్లు కొడుతున్నాయి. ఏ హీరో సినిమా అయినా. డైరెక్టర్ ఎవ్వరైనా. బ్రహ్మీకంటూ ఓ కామెడీ క్యారెక్టర్ సినిమాల్లో ఉండేది ఒకప్పుడు. సినిమా యవరేజ్ ఉన్నా. బ్రహ్మీ కామెడీతో హిట్లు. బ్లాక్ బ్లాస్టర్లు అయ్యేవి. ఇక సినిమాలు కూడా తగ్గడంతో బ్రహ్మీ కేవలం స్టార్ల సినిమాలో మాత్రమే కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేతిలో లేకపోవడంతో గుళ్లు.. గోపురాలు తిరుగుతున్నాడు బ్రహ్మానందం. ఇందులో బాగంగానే చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించాడు . ఈ సంధర్బంగా దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చినజీయర్ పాదాల వద్ద కూర్చున్న బ్రహ్మీ… తన టైమింగ్ కామెడీతో చినజీయర్ స్వామి వారిని కూడా నవ్వించాడు. మరొక ఫోటోలో తనకు కామెడీ ప్రసాదించు స్వామి అన్నట్టు కోతిలా నమస్కారం చేసే ఫోటో ఒకటి జనాలను బాగా ఆకర్షిస్తుంది.