శ్రీలీల లవ్ కి బ్ర‌హ్మానందం హెల్ప్

40
- Advertisement -

మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాలో శ్రీలీల ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం గుంటూరు కారం మూవీలో కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం ఓ కామియో చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. బ్ర‌హ్మానందం – శ్రీలీల మధ్య ఓ స్పెషల్ ట్రాక్ నడుస్తోందట. ముఖ్యంగా శ్రీలీల – మహేష్ లవ్ ట్రాక్ కి బ్ర‌హ్మానందం చాలా హెల్ప్ చేస్తాడట. ఈ క్రమంలో వచ్చే సీన్స్ అన్నీ చాలా బాగుంటాయని.. సినిమాలోనే ఈ సీన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయట.

జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13, 2024న రిలీజ్ కాబోతుంది. థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే ప్లేస్ లో మీనాక్షి చౌదరి నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రానున్న ఈ సినిమా పూర్తి గుంటూరు నేపథ్యంలో సాగనుంది. పైగా ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పొలిటికల్ అనలైజర్ గా కనిపించబోతున్నాడు. ఏది ఏమైనా ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: Oscar:ప్రౌడ్‌ మూమెంట్‌.. జ్యూరీలో ఆర్ఆర్ఆర్ టీం..

ఇక రీసెంట్ గా గుంటూరు కారం నుంచి గింప్ల్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ స్ట్రైక్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో అదిరిపోయింది. దాంతో ఈ గుంటూరు కారం పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. మ‌హేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం త్రివిక్రమ్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

Also Read: నిఖిల్ ‘స్పై’ రిజల్ట్ ఇదే

- Advertisement -