బోయపాటి-బెల్లంకొండల సినిమాకు ముహూర్తం ఫిక్స్..

256
Online News Portal
Bellamkonda Sreenivas after Speedunnodu
- Advertisement -

‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాలతో మాస్, క్లాస్ ప్రేక్షకులకు దగ్గరైన కమర్షియల్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘శ్రీమంతుడు’, ‘రుద్రమదేవి’, ‘కుమారి 21 ఎఫ్’ వంటి పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన ఘనత ప్రముఖ డిస్త్రిబ్యూషన్ సంస్థ శ్రీ అభిషేక్ పిక్చర్స్ సొంతం. ప్రేక్షకులకు మంచి చిత్రాలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ అభిషేక్ పిక్చర్స్ సంస్థ అధినేత అభిషేక్ నామా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించనున్న సినిమా వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

‘ఎర్రతోలు కదా స్టైలుగా ఉంటాడు అనుకుంటున్నావేమో.. మాస్… ఊర మాస్” – “సరైనోడు’లో అల్లు అర్జున్ మాత్రమే కాదు, దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఊర మాసే. మాస్తో పాటు అల్లు అర్జున్లో క్లాస్, స్టైల్కి తగ్గటు ఆయనలో క్లాస్ కూడా చూపించారు. మాస్.. క్లాస్.. రెండిటిని బ్యాలెన్స్ చేయడంలో బోయపాటి “సరైనోడు’ అనిపించుకున్నారు. ఈ ఏప్రిల్లో విడుదలైన “సరైనోడు’ సినిమా హీరో అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను కెరీర్స్లో బిగెస్ట్ హిట్గా. ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన సినిమాల్లో బిగెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. “సరైనోడు’ భారీ హిట్ తర్వాత బోయపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ – “బోయపాటి మార్క్ స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. బెల్లంకొండ శ్రీనివాస్కి సరైన కథ. ఈ సినిమా కోసం శ్రీను మేకోవర్ అవుతున్నాడు. లవ్, యాక్షన్. రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆరు నెలలుగా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్ 4న పూజా కార్యక్రమాలతో చిత్రం ఘనంగా చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించనున్నాం. ఆ ධීරභබී రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. బోయపాటి శ్రీనుకి ‘లెజెండ్”, బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి ‘అల్లుడు శీను’ వంటి మ్యూజికల్ హిట్స్ అందించిన యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం” అన్నారు.

- Advertisement -