ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం..

80
boxing

టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త్ మ‌రో ప‌త‌కం సాధించింది. బుధ‌వారం 64-69 కేజీల విభాగంలో జ‌రిగిన సెమీఫైన‌ల్లో ట‌ర్కీ బాక్స‌ర్ బుసెనాజ్ సూర్మ‌నెలి చేతిలో 0-5తో లవ్లీనా ఓడిపోయి కాంస్య‌ప‌త‌కం సాధించింది. మొత్తం 5 రౌండ్లలోకూడా సుర్మెనెలి ఆదిప‌త్యం కొన‌సాగించింది.

బ్రాంజ్ మెడ‌ల్‌కు ప‌రిమిత‌మైన లవ్లీనాకు ప్ర‌ధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు. అద్భుతంగా పోరాడ‌వు ల‌వ్లీనా.. బాక్సింగ్ రింగులో ఆమె సాధించిన స‌క్సెస్ అంద‌రికీ ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ల‌వ్లీనా భ‌విష్య‌త్తులో మ‌రింత రాణించాల‌ని కోరారు.

ఇప్ప‌టికే ఇండియా వెయిట్ లిఫ్టింగ్‌లో చాను ర‌జ‌తం, షటిల్‌లో పీవీసింధు కాంస్య‌ప‌త‌కాలు గెలుచుకున్నారు. దీంతో ఇండియా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఒలింపిక్స్‌లో మూడు ప‌త‌కాలు సాధించింది.