దళితవాడలో సీఎం కేసీఆర్ పర్యటన..

52
cm

తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించారు సీఎం కేసీఆర్. వాసాలమర్రికి చేరుకున్న సీఎం..దళిత వాడలో పర్యటించారు. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌తో పాటు ద‌ళితుల‌ స్థితిగ‌తుల‌ను అడిగి తెలుసుకున్నారు.

ద‌ళిత‌వాడ‌లో ప‌ర్య‌ట‌న అనంత‌రం.. గ్రామ‌మంతా క‌లియ తిరుగుతూ పారిశుద్ధ్య చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. అనం‌తరం రైతు వేదిక భవ‌నంలో ఏర్పా‌టు‌చే‌సిన సమా‌వే‌శంలో గ్రామా‌భి‌వృ‌ద్ధిపై గ్రామ‌స్థు‌లతో చర్చిం‌చ‌ను‌న్నారు. గత పర్య‌టన సంద‌ర్భంగా తాను చేసిన పలు సూచ‌నల అమ‌లు‌తీ‌రుపై ఈ సంద‌ర్భంగా సీఎం సమీ‌క్షించ‌నున్నారు.

గత జూన్‌ 22న తొలి‌సా‌రిగా వాసా‌ల‌మ‌ర్రికి వచ్చిన ముఖ్య‌మంత్రి.. గ్రామ‌స్థు‌లతో కలిసి గ్రామా‌భి‌వృ‌ద్ధిపై చర్చించి అనం‌తరం సహ‌పంక్తి భోజనం చేశారు. 42 రోజుల తర్వాత సీఎం మరో‌సారి గ్రామా‌నికి వ‌చ్చారు.