- Advertisement -
అవిశ్వాస పరీక్షలో నెగ్గారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. సొంత పార్టీ సభ్యులే బోరిస్‌పైఅవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా బోరిస్‌కు మద్దతుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 211 సభ్యులు ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 148 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో అవిశ్వాస పరీక్షలో నెగ్గారు జాన్సన్.
అనంతరం మాట్లాడిన జాన్సన్… 59 శాతం మంది సభ్యులు తనకు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయం తనకు శుభ పరిణామం అని ..ఇది చాలా సానుకూల, నిర్ణయాత్మకమైన ఫలితం అని చెప్పారు.
2019లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు బోరిస్ జాన్సన్. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో డౌనింగ్ స్ట్రీట్‌లో జోరుగా పార్టీలు జరుగగా నియమావళిని ఉల్లంఘించి ఆ పార్టీలకు ప్రధాని హాజరైనట్లు ఆరోపణలు రావడంతో అవిశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు.
- Advertisement -