అన్నిదానాల కంటే రక్తదానం గొప్పది…

404
bonthu rammohan
- Advertisement -

అన్నిదానాల కంటే రక్తదానం గొప్పదన్నారు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటిఆర్ పిలుపు మేరకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో వెంగళరావు నగర్ లో బ్లడ్ డోనేషన్ క్యాంప్ ప్రారంభించారు మేయర్ బొంతు రామ్మోహన్.

ఈ సందర్భంగా మాట్లాడిన బొంతు..పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే గోపీనాథ్ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇవాళ ప్రత్యేకంగా మహిళలు రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు.

ఈ లాక్ డౌన్ సమయంలో రక్తం ఎంతో అవసరం ఉందని … రక్తదానం చేస్తున్న అందరిని అభినందిస్తున్నామని చెప్పారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ని కార్యకర్తలు విజయవంతం చేస్తున్నారని కొనియాడారు.

- Advertisement -