జాన్వీ లవ్ అఫైర్‌పై బోనీ కామెంట్స్‌..!

461
- Advertisement -

అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్‌ల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ తరచూ వార్తల్లో చకర్లు కొడుతూవుంటుంది. ఇక సోషల్‌ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు ప్రతీ మూమెంట్ అప్‌ డేట్‌ చేస్తుంది. తను జిమ్‌లో వర్కఅవుట్ చేసే సమయంలో చిట్టి పోట్టి డ్రెస్‌లు ధరించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. దీంతో జాన్వీకి యూత్‌లో యమా క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

janvi workout

జాన్వీ కపూర్‌ ‘ధడక్’తో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఇషాన్‌ ఖత్తర్‌ హీరోగా నటించాడు. అయితే వీరిద్దరు ఈ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారని టాక్‌. ఇటీవలి కాలంలో ఫంక్షన్లు, డిన్నర్‌లలో ఇషాన్‌ ఖత్తర్‌తో కలిసి జాన్వీ కనిపిస్తుండగా,వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే ప్రచారానికి మరింత బలాన్ని చేకురుస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై బోనీ కపూర్ స్పందించారు.

janhvi kapoor

జాన్వీ ప్రేమలో ఉందని వస్తున్న వార్తలన్నీ కల్పితాలని కొట్టిపారేశారు. ‘అవును.. ఇషాన్‌, జాన్వీ కలిసి సినిమాలో నటించారు. అందుకే స్నేహితులు అయ్యారు. నాకు నా కుమార్తెపై గౌరవం ఉంది. ఇషాన్‌తో తన స్నేహాన్ని కూడా నేను గౌరవిస్తాను’ అని పేర్కొన్నారు బోనీ కపూర్‌. జాన్వీ ప్రస్తుతం ‘తక్త్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

- Advertisement -