లాల్ దర్వాజ అమ్మవారి శక్తి గొప్పది: కిషన్ రెడ్డి

493
kishan reddy
- Advertisement -

ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరుగుతున్న బోనాల సంబరాల్లో పాల్గొన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు కళాకారులు.

దేశ రాజధానిలో పండగ చేయడం ఆనందంగా ఉందన్నారు. లాల్ దర్వాజ అమ్మవారి శక్తి గొప్పదని తెలిపిన కిషన్ రెడ్డి ఢిల్లీ లో బోనాల పండుగ ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు దేశ ప్రజలకు తెలుస్తాయన్నారు. దేశ ప్రజలకు లాల్ దర్వాజ అమ్మవారు, సుఖ: సంతోషాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని వేడుకున్నానని తెలిపారు కిషన్ రెడ్డి.

ఇక ఆషాఢ బోనాలు గోల్కొండ కోట ఎల్లమ్మ జగదాంబిక ఆలయంలో ప్రారంభమయ్యాయి. లంగర్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి తొమ్మిది రకాల పూజలతో బోనాల ఉత్సవాలను ప్రారంభించారు మంత్రులు.

- Advertisement -