వైభవంగా ప్రారంభమైన బోనాల జాతర

3
- Advertisement -

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాడమాస బోనాల ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన శ్రీ జగదాంబికా అమ్మవారి పూజలతో ఈ వార్షిక జాతర ఘనంగా శ్రీకారం చుట్టుకుంది.

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల ఉత్సవాల వేళ, భాగ్యనగరం అంతా ఆధ్యాత్మిక శోభతో ముస్తాబైంది.భక్తులతో పోటెత్తిన గోల్కొండ కోటఆషాడ మాసం మొదటి గురువారం నాడు గోల్కొండ కోటలోని ఎల్లమ్మ, జగదాంబిక అమ్మవార్లకు తొలి బోనం సమర్పించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఈ క్రమంలోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు.

ముస్తాబైన ఘటాల ఊరేగింపు, పోతురాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్లతో కోట పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. అమ్మవారికి ‘తొలి బోనం’ సమర్పించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.సీఎం రేవంత్ రెడ్డికి అధికారిక ఆహ్వానంగోల్కొండ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఉత్సవాల అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.

Also Read:కేంద్రమంత్రి కుమారస్వామితో కేటీఆర్‌ భేటీ

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో ఆలయ పూజారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని కలిసి సాంప్రదాయబద్ధంగా బోనాల జాతరకు రావాల్సిందిగా ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు సాగే ఈ బోనాల ఉత్సవాలు గోల్కొండతో ప్రారంభమై, ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, అనంతరం పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలతో ముగుస్తాయి. ప్రకృతి కరుణించాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు.

- Advertisement -