తొలి రోజు ఘనంగా గోల్కొండ బోనాలు..

236
Golconda Bonalu
- Advertisement -

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే గోల్కొండ బోనాల పండుగ నేడు ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు శ్రీజగదాంబికా అమ్మవారికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఎ. ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, టి.పద్మారావు లు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Golconda Bonalu

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బోనాల పండుగను ఘనంగా జరుపుతున్నామని చెప్పారు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించామని తెలిపారు. గత సంవత్సరం బోనాల పండుగకు రూ. 10 కోట్లు కేటాస్తే, ఈ ఏడాది రూ. 15 కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను సీఎం కేసీఆర్ ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా కృషి చేస్తున్నారని అన్నారు.

తొమ్మిది వారాల పాటు జరగనున్న బోనాల పండుగకు లక్షలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ సంబురాలకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి.. ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చూస్తుందని పేర్కొన్నారు. అమ్మవారి తొట్టెల కార్యక్రమంలో పోతురాజుల నృత్యం, జానపద గీతాలు, డబ్బుల విన్యాసాలలో దాదాపు 500 మంది కళాకారులు పాల్గొన్నారు.

- Advertisement -