ఎస్పీ బాలు హెల్త్ అప్‌డేట్..

98
balasubramanyam

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తాజా ఆరోగ్య పరిస్ధితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది ఎంజీఎం ఆస్పత్రి. బాలు ఆరోగ్య పరిస్ధితి మరింత మెరుగుపడిందని హెల్త్ బులిటెన్‌లో తెలిపిన డాక్టర్లు చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు.

కరోనా పాజిటివ్ రావడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చేరారు ఎస్పీబాలు. అప్పటినుండి ఆయన ఆరోగ్య పరిస్ధితిపై పుకార్లు షికార్ చేస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తున్నారు డాక్టర్లు.

తాజాగా ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తగ్గిందని ఆరోగ్య పరిస్ధితి మెరుగుతపడుతోందని వెల్లడించారు. బాలు తనయుడు చరణ్ సైతం తండ్రి ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.