సోనూసూద్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

135
sonu
- Advertisement -

రియల్ హీరో సోనూసూద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌(బీఎంసీ) తనపై వేసిన కేసును కొట్టివేయాలని ముంబై హైకోర్టును ఆశ్రయించగా ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. బృహన్​ ముంబయి కార్పొరేషన్ నోటీసులపై 10 వారాల సమయం కావాలన్న సోనూసూద్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

ముంబైలోని జుహూలో ఉన్న ఆరంతస్తుల భవనాన్ని ఎలాంటి అనుమతులూ లేకుండానే హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ గత ఏడాది అక్టోబరులో సోనూసూద్‌కు నోటీసులు పంపింది. ఈ విషయంపై సోనూసూద్​ ఇప్పటికే జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కోర్టు పిటిషన్​ను తిరస్కరించింది. హైకోర్టు కూడా ఇదే తీర్పును వెల్లడించింది.

- Advertisement -