హీరో సూర్యకు బాంబు బెదిరింపు కాల్..

159
hero suriya

తమిళ స్టార్ హీరో సూర్యకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆఫీస్‌లో బాంబ్‌ పెట్టామంటూ ఆగంతకులు ఫోన్ కాల్ చేయడంతో హుటాహుటిన చెన్నైలోని అల్వార్‌పేట సమీపంలో ఉన్న సూర్య ఆఫీసుకు చేరుకున్నారు పోలీసులు. ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఇటీవలి కాలంలో వరుసగా సినీ పెద్దలను టార్గెట్‌ చేస్తూ బెదిరింపు కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇంటికి బాంబ్‌ బెదిరింపు కలకలం సృష్టించగా.. ఆ తర్వాత హీరోలు అజిత్‌, విజయ్‌, దర్శకుడు మణిరత్నం ఇలా పలువురికి బెదిరింపుకాల్స్ వచ్చాయి.