ఢిల్లీ లోని పలు పాఠశాలలకు బాంబు దాడులు జరుగుతాయంటూ బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో సోమవారం ఉదయం భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ కాంట్‌లోని లోరెటో కాన్వెంట్ స్కూల్, శ్రీనివాసపురిలోని కేంబ్రిడ్జ్ స్కూల్, రోహిణిలోని వెంకటేశ్వర్ స్కూల్‌లతో పాటు మరికొన్ని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అధికారుల సమాచారం ప్రకారం, ఈమెయిల్స్‌లో ఈస్ట్ ఢిల్లీలోని ఆల్కాన్ స్కూల్, రోహిణిలోని బాల్ భారతి స్కూల్, అశోక్ విహార్‌లోని జస్పాల్ కౌర్ స్కూల్, మాతా జై కౌర్ స్కూల్ వంటి పలు పాఠశాలల పేర్లు ప్రస్తావించబడ్డాయి.
ఉదయం పాఠశాల యాజమాన్యానికి ఈ బెదిరింపు ఈమెయిల్స్ కనిపించడంతో వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అనంతరం ఎమర్జెన్సీ బృందాలు పాఠశాల ప్రాంగణాల్లో సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.
బాంబు బెదిరింపులు వచ్చిన పాఠశాలల్లో లోరెటో కాన్వెంట్ స్కూల్ (ఢిల్లీ కాంట్), కేంబ్రిడ్జ్ స్కూల్ (శ్రీనివాసపురి, NFC), వెంకటేశ్వర్ స్కూల్ (రోహిణి), ది ఇండియన్ స్కూల్ (సాదిక్ నగర్), సీఎమ్ స్కూల్ (రోహిణి), డీటీఏ స్కూల్ (ఐఎన్‌ఏ), బాల్ భారతి స్కూల్ (రోహిణి), ఎయిర్ ఫోర్స్ స్కూల్ (లోధీ రోడ్), కేఆర్ మంగళం, ఇండియన్ స్కూల్ తదితరాలు ఉన్నాయి.
Also Read:ఎన్నికల ప్రచారం..మాజీ మంత్రి హరీష్ రికార్డ్
ఢిల్లీ లోని తొమ్మిది పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో ఢిల్లీ పోలీస్, ఫైర్ సర్వీసులు, బాంబు నిర్వీర్య బృందాలు మోహరించాయి. సౌత్ ఢిల్లీలో ఇప్పటివరకు మూడు పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్య ఈ కాల్స్ అందాయి అని ఒక పోలీస్ అధికారి తెలిపారు.

